Friday, 5 May 2017

// // Leave a Comment

wifi services by face book



CAR FRESHNER
సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారతదేశంలో ఎక్స్‌ప్రెస్‌ వైఫైను ప్రారంభించింది. ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మేఘాలయా రాష్ట్రాల్లో ఈ సర్వీసులు ప్రారంభమైనట్టు ఫేస్‌బుక్‌ ప్రతినిధులు ప్రకటించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో 700 వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. గత రెండేళ్లుగా దేశవ్యాపంగా ఉన్న ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో కలిసి ఈ సర్వీసును ప్రయోగాత్మకంగా నిర్వహించినట్టు తెలుస్తోంది. అనంతరం వాణిజ్యపరంగా వీటిని గురువారం నుంచి ప్రారంభించారు.
ఎయిర్‌టెల్‌తో కలిసి...
దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌తో కలిసి దాదాపు 20 వేల హాట్‌స్పాట్లను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించింది. ఎక్స్‌ప్రైస్‌ వైఫై అనుసంధానత ప్రసుత్తం భారత్‌, ఇండోనేషియా, కెన్యా, నైజీరియా, టాంజానియా దేశాల్లో లభ్యమవుతున్నట్టు తెలిపింది. ఎక్స్‌ప్రెస్‌ వైఫైను పొందాలనుకునేవారు ఎక్స్‌ప్రెస్‌ వైఫైలో ఖాతా తెరిచి రోజు, వారం, లేదా నెలకు డేటా ప్యాక్‌లను కొనుగోలు చేయాల్సివుంటుంది.
CAR FRESHNER
భారత్‌లో 130 కోట్ల జనాభా ఉన్నా 390 మిలియన్ల ప్రజలు మాత్రమే ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని పొందుతున్నారని ట్రాయ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని విస్తరించడం ద్వారా ఇంకా అనేకమంది వీటి సేవలను పొందవచ్చని ఫేస్‌బుక్‌ ప్రతినిధులు తెలిపారు.
source ~:eenadu
Read More